-->

ఏపీ సీఎం చంద్రబాబు భద్రతలో మార్పులు

ఏపీ సీఎం చంద్రబాబు భద్రతలో మార్పులు


ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడి భద్రతా వ్యవస్థలో కొత్త మార్పులు చోటుచేసుకున్నాయి.

మావోయిస్టుల నుంచి సీఎంకు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో, ఆయన భద్రతను పర్యవేక్షించే స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ (ఎస్ఎస్‌జీ)లో ఇటీవల కొన్ని కీలక మార్పులు చేశారు.

ఇందులో భాగంగా, బ్లాక్ క్యాట్ కమాండోలతో పాటు ఎస్ఎస్‌జీ సిబ్బందికి అదనంగా కౌంటర్ యాక్షన్ బృందాలను కూడా చేర్చారు.

సీఎం భద్రతా వ్యవస్థలో ఈ కౌంటర్ యాక్షన్ బృందానికి ప్రత్యేక స్థానం కల్పించారు. ఈ బృందంలో ఆరుగురు కమాండోలు అత్యంత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడతారు.

సీఎం భద్రత మరింత పటిష్ఠం కావాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది.


Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793