మాజీ మంత్రి కేటీఆర్‌కు సుప్రీం కోర్టు షాక్
ఫార్ములా 1 రేసింగ్ కేసు అంశంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. ఈ కేసును లొట్టిపీసు కేసుగా అభివర్ణిస్తూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను హైకోర్టు నమ్మలేదు, ఇప్పుడు సుప్రీం కోర్టు కూడా ఆ అభిప్రాయాన్ని అంగీకరించలేదు.
ఈ కేసును కొట్టివేయమని కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు నేడు తిరస్కరించింది. జస్టిస్ బేలా ఎం. త్రివేది మరియు జస్టిస్ ప్రసన్న వర్లే నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసులో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.
ఇదే చివరి అవకాశం కావడంతో, ఈ కేసు మరింత చర్చనీయాంశంగా మారింది. కేటీఆర్ ఈ గురువారం ఈడీ విచారణకు హాజరుకానున్నారు. ఏసీబీ విచారణ సమయంలో కేటీఆర్ అరెస్టుకు అవకాశం ఉందని భావించినా, ఆ సమయంలో కేవలం ప్రశ్నించి పంపించేశారు.
కేటీఆర్ దీన్ని లొట్టిపీసు కేసు అని చెబుతుండగా, ఈడీ ప్రశ్నించి విడిచిపెడుతుందా లేక అరెస్ట్ చేస్తుందా అనే ప్రశ్నలపై ఉత్కంఠ నెలకొంది. ఈ వ్యవహారంపై రేపటికి స్పష్టత రావచ్చు.

Post a Comment