-->

ఘనంగా 23వ భీమాదేవార జెండా ఆవిష్కరణ

 

ఘనంగా 23వ భీమాదేవార జెండా ఆవిష్కరణ

కొమురం భీం జిల్లా బెజ్జుర్ మండలంలోని కుశ్నపెల్లి గ్రామంలో 23వ భీమన్న దేవార జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా గ్రామస్థులు భీమన్న దేవుని గుడికి వెళ్లి మొక్కులు తీర్చుకుని, సాంప్రదాయ పూజలు నిర్వహించారు. అనంతరం కోడిపే శంకర్ గారు భీమాదేవార జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా గ్రామ పెద్దలు కొడిపే వెంకటేష్, అన్నం మధునయ్య గార్లు మాట్లాడుతూ, “మన కొలవార్ సంప్రదాయాలను పాటిస్తూ భీమాదేవార జెండా పండుగను ప్రతీ సంవత్సరం ఘనంగా నిర్వహించడం ఆనందకరమైన విషయం” అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు పెద్దల సంతోష్, కోడిపే లక్ష్మి నారాయణ, మడె వసంత్, పెద్దల శంకర్, నాయిని ధర్మయ్య, బుర్స మహేష్, మడె మధుకర్, ఆదివాసి సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆత్రం బక్కయ్య, జిల్లా యూత్ అధ్యక్షులు మేడి సతీష్, జిల్లా సహాయ కార్యదర్శి వెంకటేష్, బెజ్జుర్ మండల ఉపాధ్యక్షులు మానేపెల్లి మల్లేష్, బెజ్జుర్ గ్రామ గౌరవ అధ్యక్షులు మేకల శ్రీను, చింతపూడి గణపతి, గొర్రెపెల్లి సాంబయ్య, మెట్టుపెల్లి అర్జున్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ మహిళలు, యువకులు కూడా ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నారు.


Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793