పత్తి చేనులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
ములుగు జిల్లా: ఘోర ప్రమాదం తప్పింది. గోవిందరావుపేట మండలం చల్వాయి వద్ద ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పత్తి పొలాల్లోకి దూసుకెళ్లింది.
ఈ ఘటనలో ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదం సంభవించే సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
హనుమకొండ నుంచి మంగపేటకు వెళ్తున్న ఈ బస్సు రన్నింగ్‌లో ఉండగా స్టీరింగ్ సమస్య ఏర్పడిందని, అందువల్లనే ఈ ప్రమాదం జరిగిందని బస్సు డ్రైవర్ వివరించారు.

Post a Comment