-->

సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులకు రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్

సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులకు రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్

టిబిజికెఎస్ రాష్ట్ర చీఫ్ జనరల్ సెక్రటరీ కాపు కృష్ణ

కొత్తగూడెం: సింగరేణి సంస్థలో పనిచేసి పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఎలాంటి షరతులు లేకుండా రేషన్ కార్డులు మంజూరు చేయాలని టెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టిబిజికెఎస్) రాష్ట్ర చీఫ్ జనరల్ సెక్రటరీ కాపు కృష్ణ డిమాండ్ చేశారు. బుధవారం ఒక ప్రకటనలో ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు.

ఈ నెల 26వ తేదీ నుంచి పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభం అవుతుందని ప్రకటించిన నేపథ్యంలో, రిటైర్డ్ ఉద్యోగులకు కూడా కులగణన ఆధారంగా రేషన్ కార్డులు మంజూరు చేయాలని కాపు కృష్ణ కోరారు.

అయన డిమాండ్‌లు:

  1. సింగరేణిలో పనిచేసి రిటైర్డ్ అయిన ఉద్యోగులకు ఎలాంటి కండీషన్లు లేకుండా రేషన్ కార్డులు ఇవ్వాలి.
  2. డీఎల్ కార్మికుల ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు అందుబాటులో ఉండేలా చూడాలి.
  3. ఇప్పటికే రేషన్ కార్డులు ఉన్నవారికి వారి పిల్లల పేర్లను నమోదు చేయాలి.

కాపు కృష్ణ ఈ డిమాండ్‌లను ప్రభుత్వానికి విన్నవించి, సమస్యల పరిష్కారం కోసం తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793