మున్సిపాలిటీలో పెండింగ్ పనుల పూర్తి చేయాలి ఎంఐఎం మోహీద్ పటేల్
నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలో పెండింగ్‌లో ఉన్న సీసీ రోడ్లు, మురికివాడ కాలువల నిర్మాణాలు, వీధి దీపాల సమస్యలు పరిష్కరించాల్సిన అవసరముందని ఎంఐఎం అధ్యక్షుడు మరియు న్యాయవాది మోహీద్ పటేల్ పేర్కొన్నారు. ఈ విషయమై గురువారం మున్సిపల్ కమిషనర్ జె. జెగ్జీవన్‌కు వినతిపత్రం అందజేశారు.
ఆయన మాట్లాడుతూ, మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి వార్డులో పారిశుద్ధ్య పనులు సక్రమంగా జరగాలని, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మోహీద్ పటేల్ ఆరోపిస్తూ, నారాయణఖేడ్ మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ మరియు కొందరు వార్డు కౌన్సిలర్లు తమ బాధ్యతల నిర్వహణలో విఫలమయ్యారని, దీంతో ప్రజలకు అసౌకర్యాలు ఎదురవుతున్నాయని అన్నారు. త్వరితగతిన పనులు పూర్తి చేసి ప్రజలకు సేవలు అందించాలని ఆయన కోరారు.

Post a Comment