-->

ఏపీలో మందుబాబులకు గుడ్‌న్యూస్: మద్యం ధరలు తగ్గింపు

ఏపీలో మందుబాబులకు గుడ్‌న్యూస్: మద్యం ధరలు తగ్గింపు


సంక్రాంతి పండుగ సందర్బంగా ఏపీ మందుబాబులకు మద్యం కంపెనీలు శుభవార్త చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 16 కంపెనీల మద్యం ఉత్పత్తులు అందుబాటులో ఉంటే, వీటిలో 10 బ్రాండ్ల ధరలు ఇప్పటికే తగ్గించాయి. తాజాగా, మిగతా 6 కంపెనీలూ తమ ఉత్పత్తులపై ధరలు తగ్గించాయి.

మద్యం విక్రయాలను పెంచుకోవడానికి కంపెనీలు ధరలను తగ్గించడం ప్రారంభించాయి. ముఖ్య బ్రాండ్లు తమ ఉత్పత్తుల ధరలు తగ్గించడంతో, ఇతర కంపెనీలపై కూడా ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో, అవి కూడా ధరల తగ్గింపుకు ముందుకు వస్తున్నాయి. దీంతో తగ్గింపు చేసిన బ్రాండ్ల అమ్మకాలు మార్కెట్‌లో భారీగా పెరుగుతున్నాయి.

ఇక మద్యం విక్రయాలపై కట్టుదిట్టమైన నిఘా కొనసాగుతోంది. అధిక ధరలకు విక్రయాలు చేయడం లేదా బెల్టు షాపులు నిర్వహించడం కొనసాగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.

మద్యం బ్రాండ్లలో క్వార్టర్ బాటిల్ ధర రూ.20 నుంచి రూ.80 వరకు తగ్గినట్లు అధికారులు ప్రకటించారు. ఉదాహరణకు:

  • మాన్షన్‌ హౌస్‌: క్వార్టర్‌పై రూ.30 తగ్గింపు.
  • అరిస్ర్టోకాట్‌ ప్రీమియం సుపీరియర్‌ విస్కీ: రూ.50 తగ్గింపు.
  • కింగ్‌ఫిషర్‌ బీర్: రూ.10 తగ్గింపు.

ఈ చర్యలతో మార్కెట్‌లోకి తగ్గింపు ధరలతో మద్యం అందుబాటులోకి రావడంతో వినియోగదారుల్లో ఉత్సాహం నెలకొంది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793