-->

ఖమ్మం పత్తి మార్కెట్‌లో భారీ అగ్ని ప్రమాదం

ఖమ్మం పత్తి మార్కెట్‌లో భారీ అగ్ని ప్రమాదం

ఖమ్మం పత్తి మార్కెట్‌లో 2025, జనవరి 15న రాత్రి జరిగిన అగ్ని ప్రమాదం కలకలం రేపింది. రైతుల పండుగ కనుమ సందర్భంగా మార్కెట్‌ యార్డ్ షెడ్‌లో ఉన్న పత్తి బస్తులకు ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో ఈ ప్రమాదం సంభవించింది.

క్షణాల్లో మంటలు వ్యాపించడంతో అక్కడ నిల్వ ఉన్న సుమారు 400 పత్తి బస్తులు పూర్తిగా దగ్ధమయ్యాయి. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు.

ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం కొంత ఊరట కలిగించినా, భారీ ఆస్తి నష్టం రైతులు, వ్యాపారులను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే పరిశీలన చేపట్టి, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

ఈ అగ్ని ప్రమాదం కారణంగా మార్కెట్‌కు వచ్చిన రైతులు భయాందోళనకు గురవడం గమనార్హం. ఆస్తి నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793