ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల జాబితా సంక్రాంతి తర్వాతే?
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల పథకంకు సంబంధించి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ పథకం కింద రాష్ట్రంలోని నిరుపేదలకు ఇల్లు నిర్మించేందుకు ప్రతి లబ్ధిదారుకు రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందించనున్నారు. ఈ మొత్తం నాలుగు విడతల్లో లబ్ధిదారుల ఖాతాలో జమ కానుంది. మొదటి విడతలో ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లను కేటాయించనున్నారు.
దరఖాస్తుల సంఖ్య భారీగా:
ఈ పథకం కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 80,54,554 దరఖాస్తులు అందాయి. గ్రామాలలో గ్రామ కార్యదర్శులు, పురపాలిక వార్డు అధికారులతో కలిసి ఇందిరమ్మ ప్రత్యేక యాప్ ద్వారా సర్వే చేపడుతున్నారు. ఇంటి ఇంటికి వెళ్లి లబ్ధిదారుల వివరాలను సేకరిస్తున్నారు. ఇప్పటివరకు 68,57,216 దరఖాస్తుల వివరాలు సేకరించారు.
సూపర్ చెక్ ప్రక్రియ:
సర్వేలో తప్పుడు సమాచారం నమోదు చేసారా? లేదా అక్రమాలు జరిగాయా? అనే అంశాలను తెలంగాణ గృహనిర్మాణ శాఖ పరిశీలిస్తోంది. ఈ క్రమంలో సూపర్ చెక్ పేరుతో దాదాపు 4.02 లక్షల దరఖాస్తులను మళ్లీ సర్వే చేయనున్నారు. ఈ ప్రక్రియను ఎంపీడీవోలు (MPDO) గ్రామాల్లో, కమీషనర్లు (Commissioners) పురపాలికల్లో పర్యవేక్షిస్తారు.
దశలవారీగా ఆమోదం:
సర్వే పూర్తయిన తర్వాత, యాప్‌లో నమోదు చేసిన లబ్ధిదారుల వివరాలను ప్రత్యక్షంగా చెక్ చేస్తారు. అన్ని ప్రక్రియలు పూర్తయిన తర్వాత లబ్ధిదారుల జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. అయితే, ఈ జాబితా సంక్రాంతి తర్వాతే విడుదల కానుంది.
ఇందిరమ్మ పథకంలో నిబంధనలకు అనుగుణంగా అన్ని దరఖాస్తుల తనిఖీలు పూర్తయి, న్యాయమైన లబ్ధిదారులు ఎంచుకోవడం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

Post a Comment