-->

తిరుమల ఘటనపై ఖేడ్ ఎంఐఎం అధ్యక్షుడు మోహీద్ పటేల్ తీవ్ర దిగ్భ్రాంతి

 

తిరుమల ఘటనపై ఖేడ్ ఎంఐఎం అధ్యక్షుడు మోహీద్ పటేల్ తీవ్ర దిగ్భ్రాంతి

తిరుమల వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం టోకెన్ల జారీ కౌంటర్ల వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై నారాయణఖేడ్ ఎంఐఎం అధ్యక్షుడు, న్యాయవాది మోహీద్ పటేల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో పలువురు భక్తులు ప్రాణాలు కోల్పోవడం ఎంతో విచారకరమని, వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన భక్తులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా భక్తుల భద్రతకు కఠిన చర్యలు తీసుకోవాలని, గాయపడిన వారికి తగిన వైద్య సదుపాయాలు అందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మోహీద్ పటేల్ కోరారు.


Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793