భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టు భవన ప్రాంగణంలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ముగ్గుల పోటీలు ఉత్సాహంగా జరిగాయి. మహిళా న్యాయవాదులు మరియు న్యాయ శాఖ మహిళా సిబ్బంది ఈ పోటీలలో ఉత్సాహంగా పాల్గొని సంక్రాంతి ఆహ్లాదాన్ని ముందుగానే ప్రతిబింబించారు.
ఈ కార్యక్రమంలో ముగ్గుల పోటీల విజేతలను జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ ఘనంగా ప్రకటించారు. పోటీలను జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ గొల్లపూడి భానుమతి, న్యాయమూర్తులు బత్తుల రామారావు, ఏ. సుచరిత, కే. సాయి శ్రీ అందంగా నిర్వహించారు.
కార్యక్రమంలో కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు తోట మల్లేశ్వరరావు, సభ్యులు దూదిపాల రవికుమార్, ఎస్. ప్రవీణ్ కుమార్, అత్తలూరి మనోరమ, జీకే అన్నపూర్ణ, ఎస్. భానుప్రియ, మీనా కుమారి, తదితర సీనియర్ మరియు జూనియర్ కోర్ట్ సిబ్బంది పాల్గొన్నారు.
ఈ ముగ్గుల పోటీలు సంక్రాంతి పండుగ ఆహ్లాదాన్ని పంచుతూ అందరినీ ఆకట్టుకున్నాయి.

Post a Comment