-->

బీసీ గర్ల్స్ వసతి గృహాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ విద్యా చందన

బీసీ గర్ల్స్ వసతి గృహాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ విద్యా చందన


కొత్తగూడెం, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన మంగళవారం సాయంత్రం బీసీ వెల్ఫేర్ అధికారి ఇ. ఇందిర తో కలిసి కొత్తగూడెంలోని బీసీ కాలేజీ గర్ల్స్ వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, బాలికలు చదువుతూనే సమాజంలో తగిన గుర్తింపు పొందాలని సూచించారు. లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదివినప్పుడే ఆశించిన ఫలితాలు సాధ్యమవుతాయని ఆమె అన్నారు.

తనిఖీ సందర్భంగా అదనపు కలెక్టర్ మెస్, విద్యార్థినుల వసతి గదులను పరిశీలించారు. హాస్టల్లో విద్యార్థినులకు అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయా అనే విషయాన్ని పర్యవేక్షించారు. విద్యార్థినులు అందించిన వసతి, ఆహార సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని మెరుగైన ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.

అనంతరం భోజన నాణ్యతను స్వయంగా పరిశీలించిన విద్యా చందన, విద్యార్థినులతో కలిసి భోజనం చేసి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న హాస్టల్ సౌకర్యాలను మెరుగుపరిచేందుకు ఎలాంటి మార్పులు అవసరమో పర్యవేక్షిస్తామని ఆమె హామీ ఇచ్చారు.

Blogger ఆధారితం.