-->

రామంతపూర్‌లో భారీ పేలుడు.. స్క్రాప్‌ డీలర్‌కు తీవ్ర గాయాలు

 

రామంతపూర్‌లో భారీ పేలుడు.. స్క్రాప్‌ డీలర్‌కు తీవ్ర గాయాలు

హైదరాబాద్‌ రామంతపూర్‌లో భారీ పేలుడు.. స్క్రాప్‌ డీలర్‌కు తీవ్ర గాయాలు

హైదరాబాద్‌: రామంతపూర్‌ చర్చ్‌ కాలనీలో భారీ పేలుడు సంభవించింది. స్థానికంగా ఉన్న ఓ స్క్రాప్‌ షాపులో లోహాన్ని కట్‌ చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో స్క్రాప్‌ డీలర్‌ పరశురామ్‌ తీవ్రంగా గాయపడ్డారు.

పేలుడు ధాటికి గాయపడిన పరశురామ్‌ను వెంటనే అంబులెన్స్‌లో గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆయన శరీరంలో సుమారు 70 శాతం కాలినట్లు సమాచారం. ప్రస్తుతం పరశురామ్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్‌ ఇంజిన్లతో ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అసలు పేలుడుకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనతో స్థానికంగా ఆందోళన నెలకొంది.

Blogger ఆధారితం.