ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
తెలంగాణలో ఎస్‌ఎల్‌బీసీ సొరంగం ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రమాద స్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు జూపల్లి కృష్ణారావు సహాయక చర్యలను దగ్గరుండి కంట్రోల్ చేస్తున్నారు. ఈ ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది కార్మికులను రక్షించేందుకు రెండో రోజూ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
సహాయక చర్యల్లో సైన్యం కూడా రంగంలోకి
ప్రమాద స్థలంలో ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ కూడా సహాయ చర్యల్లో భాగస్వామ్యం అవుతున్నాయి. ఇప్పటికే NDRF, SDRF బృందాలు రక్షణ చర్యలు చేపడుతున్నాయి. ఏ ఒక్క అవకాశాన్ని వదలొద్దని అధికారులకు సీఎం ఆదేశించారు.
ప్రమాద స్థితి – రక్షణ చర్యలు
సీఎం రెవంత్ రెడ్డి ఘటనపై పూర్తిగా అప్రమత్తంగా ఉంటూ, ప్రతి క్షణం పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

Post a Comment