శివాజీ మహారాజ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్,: భారత దేశ చరిత్రలో విశిష్ట స్థానం కలిగిన మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాసంలో శివాజీ మహారాజ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, ఆయన సేవలను స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు వాకిటి శ్రీహరి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి లతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, శివాజీ అభిమానులు, మరాఠా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఛత్రపతి శివాజీ మహారాజ్ భారతదేశానికి గొప్ప వారసత్వాన్ని అందించిన యోధుడని, ఆయన పరిపాలనా తీరుతో పాటు ధైర్యసాహసాలు దేశానికి ప్రేరణగా నిలిచాయని అన్నారు. దేశ సంరక్షణ కోసం శివాజీ మహారాజ్ చేసిన కృషి ఆదర్శప్రాయమని, ఆయన బాటలో యువత నడవాలని ఆయన సూచించారు.
అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న ప్రతినిధులు శివాజీ మహారాజ్ గారి సేవలను స్మరించుకుంటూ, ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో సాగింది. శివాజీ మహారాజ్ మహోన్నత త్యాగాలను గుర్తు చేసుకుంటూ, సమాజానికి ఆయన ఆశయాలను చేరువ చేయాల్సిన అవసరాన్ని పలువురు నేతలు సూచించారు.

Post a Comment