ముందస్తు అడ్మిషన్లు చేపట్టే విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి SFI
తక్షణమే గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ – జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్
మెదక్ జిల్లా తూప్రాన్: జిల్లాలో ముందస్తు అడ్మిషన్లు చేపడుతున్న విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకుని, వారి గుర్తింపును రద్దు చేయాలని ఎస్.ఎఫ్.ఐ జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన, విద్యా సంవత్సరం పూర్తికాకముందే కొన్ని విద్యాసంస్థలు ముందస్తుగా అడ్మిషన్లు తీసుకుంటున్నాయని ఆరోపించారు. గత రెండు నెలలుగా ఈ వ్యవహారం కొనసాగుతున్నప్పటికీ, జిల్లా విద్యాధికారి (D.E.O) మరియు సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమన్నారు.
చర్యలు తీసుకోని అధికారులపై మండిపాటు
పల్లవి స్కూల్, గీతా స్కూల్, రిషి మెమోరియల్ స్కూల్ వంటి సంస్థలు జిల్లాలో ముందస్తు అడ్మిషన్లు ప్రారంభించాయని ఆయన వివరించారు. అయినప్పటికీ, జిల్లా విద్యాధికారి మరియు మండల విద్యాధికారులు (M.E.O) మౌనం వహిస్తున్నారని విమర్శించారు.
విధిగా చర్యలు తీసుకోవాలి – ఎస్.ఎఫ్.ఐ హెచ్చరిక
ముందస్తు అడ్మిషన్లు చేపడుతున్న విద్యాసంస్థల గుర్తింపును తక్షణమే రద్దు చేయాలని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని ఎస్.ఎఫ్.ఐ హెచ్చరించింది.
ఈ కార్యక్రమంలో ఎస్.ఎఫ్.ఐ జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్, జిల్లా అధ్యక్షులు, ఇతర నాయకులు పాల్గొన్నారు.

Post a Comment