-->

రామగుండంలో 12 కిలోల గంజాయి పోలీసులు స్వాధీనం

రామగుండంలో 12 కిలోల గంజాయి పోలీసులు స్వాధీనం


పెద్దపల్లి జిల్లా రామగుండం పరిధిలోని NTPC (నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్) ప్రాంతంలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో NTPC ఎస్ఐ ఉదయ్ కిరణ్ ఆధ్వర్యంలో బుధవారం రోజు (మార్చి 19) ప్లాంట్ మెటీరియల్ గేట్ సమీపంలో వాహన తనిఖీలు చేపట్టారు.

తనిఖీల్లో భాగంగా ఒక అనుమానాస్పద వాహనాన్ని ఆపి పరిశీలించగా, అందులో 12 కిలోల గంజాయి లభ్యమైంది. ఈ ఘటనలో కరీంనగర్‌కు చెందిన మాల మల్లేశాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మల్లేశం ఈ గంజాయిని ఆంధ్రప్రదేశ్‌లోని సీలేరు ప్రాంతం నుంచి అక్రమంగా తెచ్చి, ములుగు, ఏటూరు నాగారం మార్గంగా రామగుండం NTPC ప్రాంతానికి చేరుకున్నాడు. అతను గంజాయిని లేబర్ వర్గానికి విక్రయించేందుకు ఉద్దేశించాడని ఎస్ఐ ఉదయ్ కిరణ్ వెల్లడించారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని కోర్టుకు హాజరుపరిచారు. గంజాయి రవాణా వ్యవహారంపై ఇంకా దర్యాప్తు కొనసాగుతున్నట్టు పోలీసులు తెలిపారు. రామగుండం NTPC పరిసర ప్రాంతాల్లో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను నిరోధించేందుకు పోలీసుల ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793