నేటి నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం
తెలంగాణలో వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈరోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. ఉదయం 8:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తరగతులు నిర్వహించాలని అధికారులు ఆదేశించారు.
ఇక పదో తరగతి పరీక్షలు జరుగుతున్న పాఠశాలల్లో ప్రత్యేకంగా మధ్యాహ్నం 1:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు క్లాసులు కొనసాగుతాయి. ఈ ఒక్కపూట బడులు విద్యా సంవత్సరం ముగిసే వరకు కొనసాగనున్నట్లు విద్యాశాఖ తెలిపింది.
రాష్ట్రవ్యాప్తంగా ఎండలు క్రమంగా పెరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఒంటిపూట బడులు ఏప్రిల్ 23 వరకు కొనసాగనున్నాయి. వేసవి సెలవుల అనంతరం తిరిగి పూర్తిస్థాయిలో తరగతులు కొనసాగుతాయని విద్యాశాఖ వెల్లడించింది.

Post a Comment