ములుగు అడవిలో విషాదం: ఒకే చెట్టుకు ఇద్దరు ఉరేసుకుని మృతి
ములుగు అడవిలో విషాదం: ఒకే చెట్టుకు ఇద్దరు ఉరేసుకుని మృతి
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం కర్లపల్లి శివారులోని అటవీ ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు ఒకే చెట్టుకు ఉరేసుకుని మృతిచెందిన ఘటన కలకలం రేపింది.
స్థానికులు గుర్తించిన వివరాల ప్రకారం, మృతులు హిడ్మా మరియు కమిలిగా గుర్తించారు. అడవిలో మృతదేహాలు కనిపించడంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు.
బంధువుల సమాచారం ప్రకారం, వీరిద్దరూ మామిడి తోపు ప్రాంతానికి చెందినవారు. సుమారు నెల రోజుల క్రితం ఇప్పపువ్వు సేకరించేందుకు అడవిలోకి వెళ్లిన తర్వాత కనిపించకుండా పోయినట్లు తెలుస్తోంది.
అయితే వీరి మరణానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ఇది ఆత్మహత్యా, లేక ఇతర అనుమానాస్పద పరిస్థితుల ఫలితమా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు.
మరణానికి సంబంధించిన పూర్తి వివరాలు, అసలు కారణాలు పోలీసుల విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.

Post a Comment