-->

తండ్రిని హత్య చేసిన కొడుకు, కూతురికి ఉరిశిక్ష భార్యకు జీవిత ఖైదు

తండ్రిని హత్య చేసిన కొడుకు, కూతురికి ఉరిశిక్ష భార్యకు జీవిత ఖైదు

తండ్రిని హత్య చేసిన కొడుకు, కూతురికి ఉరిశిక్ష భార్యకు జీవిత ఖైదు

మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో సంచలనాత్మక కేసులో కోర్టు కఠిన తీర్పు వెలువరించింది. పెన్షన్ డబ్బుల విషయంలో తలెత్తిన వివాదం నేపథ్యంలో రిటైర్డ్ రైల్వే ఉద్యోగి కిషన్ మారుతీ సుథార్ (70) హత్య కేసులో ఆయన కొడుకు కిషన్ సుథార్ అలియాస్ రాహుల్, కూతురు ప్రపుల్లలకు మరణశిక్ష విధించింది. హత్యకు సహకరించిన మృతుడి భార్య గంగాభాయ్కు జీవిత ఖైదు శిక్ష ఖరారు చేసింది.

పోలీసుల వివరాల ప్రకారం, మల్కాజిగిరి ఆర్టీసీ కాలనీలో నివసిస్తున్న కిషన్ మారుతీ సుథార్‌కు వచ్చే పెన్షన్ డబ్బులను తమకు ఇవ్వడం లేదనే కారణంతో పిల్లలు అతనిపై తీవ్ర అసంతృప్తి పెంచుకున్నారు. అనంతరం తల్లి సహకారంతో హత్యకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది.

ఈ కేసును విచారించిన మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కోర్టు (కుషాయిగూడ)లోని ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి, నిందితులపై బలమైన సాక్ష్యాధారాలు ఉన్నాయని నిర్ధారించి సోమవారం తీర్పు వెలువరించారు.

శిక్షలు:

  • కొడుకు కిషన్ సుథార్ అలియాస్ రాహుల్ – ఉరిశిక్ష
  • కూతురు ప్రపుల్ల – ఉరిశిక్ష
  • భార్య గంగాభాయ్ – జీవిత ఖైదు

పెన్షన్ డబ్బుల కోసం కుటుంబ సభ్యులే హత్యకు పాల్పడటం, కోర్టు మరణశిక్ష విధించడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793