-->

ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా హైకోర్టులో కేసు పెండింగ్ ఉద్యోగ నియామక నోటిఫికేషన్లు జారీ చేయకూడదు

 

ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా హైకోర్టులో కేసు పెండింగ్ ఉద్యోగ నియామక నోటిఫికేషన్లు జారీ చేయకూడదు

ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా హైకోర్టులో కేసు పెండింగ్: ఉద్యోగ నియామక నోటిఫికేషన్లు జారీ చేయొద్దని మాల మహానాడు విజ్ఞప్తి

హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకోకుండా, అత్యవసరంగా నోటిఫికేషన్లు జారీ చేయడంపై మాల మహానాడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు, మాజీ ప్రభుత్వ న్యాయవాది తల్లమల్ల హసేన్ మీడియా ప్రకటన విడుదల చేశారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను సరిగా అధ్యయనం చేయకుండా, ఉమ్మడి రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తూ చర్యలు చేపట్టింది. కానీ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మెరిట్ ఆధారంగా విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది. అలా చేయకుండానే, “దేశంలో మేమే మొట్టమొదటిగా వర్గీకరణ చేపట్టాం” అనే పేరుకు పోతు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని మాల మహానాడు ఆరోపించింది.

ఈ విషయాన్ని వ్యతిరేకిస్తూ మాల మహానాడు, షెడ్యూల్ కులాల హక్కుల పోరం సంస్థ తరఫున హైకోర్టులో పిటిషన్ దాఖలయినట్లు తెలిపారు. ఇప్పటికే రెండు వాయిదాలు గడిచినా రాష్ట్ర ప్రభుత్వం తన కౌంటర్ దాఖలు చేయకపోవడం వల్ల కేసు ఇంకా పెండింగ్‌లోనే ఉంది.

ఈ తరుణంలో ప్రభుత్వం ఉద్యోగ నియామకాల కోసం నోటిఫికేషన్లు జారీ చేయడం అనైతికమని, హైకోర్టు తీర్పు వచ్చే వరకు ఎలాంటి నోటిఫికేషన్లు జారీ చేయకూడదని తల్లమల్ల హసేన్ సూచించారు.

ఈ ప్రకటనకు మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గిడ్ల పరంజ్యోతి రావు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎడ్ల నాగరాజు, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ముండ్లగిరి కాంతయ్య, జాతీయ ప్రధాన కార్యదర్శి మేకతొట్టి కాంతయ్య, బండి అశోక్, మంచాల వెంకటస్వామి, రాష్ట్ర ఉపాధ్యక్షులు కామర్ల జానయ్య, రాష్ట్ర కార్యదర్శి దాసరి దేవయ్య, బేగరి శివరాజ్, మన్నే కృష్ణయ్య, వెలుతురు సదానందం, బంజ భూమన్న, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు బండ వరప్రసాదరావు, ప్రధాన కార్యదర్శి బొల్లు సత్యం, ఉద్యోగ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎడ్ల ముక్కంటి, జి. నర్సింగరావు, కట్ట దుర్గాప్రసాద్, సంద యాదయ్య, జిల్లాల అధ్యక్షులు దేవిదాస్, దండు రాజు, బోయిల అఖిల్, గుంతెటి వీరభద్రం, సామ రాజు, బేకరీ గాలయ్య, మేదరి నర్సింగరావు తదితరులు మద్దతు తెలిపారు.

మాల మహానాడు వర్గీకరణ విషయంలో సమగ్ర విచారణ జరిపి న్యాయసమ్మతమైన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది.

Blogger ఆధారితం.