గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంపై ప్రభుత్వం స్పందన – మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం
హైదరాబాద్: నగరంలోని గుల్జార్ హౌస్ ప్రాంతంలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం తీవ్ర విషాదానికి దారి తీసింది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్టు డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు.
ఈ విషాదకర సంఘటనపై స్పందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ, “ఈ అగ్ని ప్రమాదం ప్రభుత్వాన్ని దిగ్రహానికి గురిచేసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుంది. ఒక్కొక్క కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారం అందజేయబడుతుంది” అని తెలిపారు.
అలాగే, ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్త చర్యలు తీసుకుంటామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఘటనకు సంబంధించి సమగ్ర దర్యాప్తు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్టు ఆయన పేర్కొన్నారు.
ప్రజల భద్రతే ప్రభుత్వానికి ప్రథమ ధాన్యం అని అన్నారు. అగ్నిప్రమాదానికి కారణాలు, నిర్లక్ష్యాలపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Post a Comment