-->

ములుగు జిల్లాలో ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన చేసిన మంత్రి సీతక్క

ములుగు జిల్లాలో ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన చేసిన మంత్రి సీతక్క

ఇల్లాలికి ఆదరణ – పేదవాడికి ఆశ్రయం

ములుగు జిల్లాలో ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన చేసిన మంత్రి సీతక్క

ములుగు జిల్లా పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ కార్యక్రమంకి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖా మంత్రి సీతక్క పాల్గొన్నారు. పేద ప్రజల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతుందని, ప్రతి ఒక్కరికి తలదాచుకునే ఇల్లు కల్పించాలన్నదే ముఖ్య ఉద్దేశమని ఆమె తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, "పేదవాడు ముందుకు రావాలంటే ముందుగా అతనికి నివాసం ఉండాలి. భద్రతతో పాటు మానవ విలువలతో కూడిన జీవనం ఉండాలి. ఇందుకే ఇళ్ల నిర్మాణం ప్రాధాన్యతగా తీసుకున్నాం," అని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా నలుగురికి నిలయ స్వప్నం నెరవేరనుందని చెప్పారు.

ఇక మహిళల సాధికారతపై దృష్టి సారించిన మంత్రి, అదే రోజు స్వయం సహాయక సమూహాల మహిళలతో ముఖాముఖి చర్చలు జరిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళల ఆర్థికాభివృద్ధి, ఆత్మవిశ్వాసం పెరగాలంటే ప్రభుత్వ సహకారం కీలకమని, అందుకు తాము అవసరమైన అన్ని విధాలా తోడుంటామని హామీ ఇచ్చారు. మహిళల సమస్యలు, వారి అభిరుచులు, అభిలాషల గురించి సీతక్క స్వయంగా తెలుసుకొని, వాటికి పరిష్కారాల కోసం చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ కార్యక్రమం గ్రామీణ ప్రజల్లో విశేష స్పందన పొందింది. పేదల అభివృద్ధికి, మహిళల సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్బంగా మరోసారి స్పష్టమైంది.

Blogger ఆధారితం.