తెలంగాణలో మద్యం ధరలు పెంపు – మళ్లీ స్పెషల్ ఎక్సైజ్ సెస్ విధింపు
తెలంగాణలో మద్యం ప్రియులకు భారీ షాక్ ఇచ్చింది రాష్ట్ర ఎక్సైజ్ శాఖ. మద్యం ధరలను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. 2020లో అప్పటి ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్పెషల్ ఎక్సైజ్ సెస్‌ను మళ్లీ పునరుద్ధరిస్తున్నట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో కొన్ని రకాల మద్యం బాటిల్స్‌పై ధరలను పెంచుతున్నట్లు స్పష్టం చేసింది.
ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాలకు ఎక్సైజ్ శాఖ సర్క్యూలర్లు జారీ చేసింది. కొత్త రేట్లు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపింది. తాజా పెంపుతో:
- క్వార్టర్ బాటిల్పై రూ.10 పెంపు
- హాఫ్ బాటిల్పై రూ.20 పెంపు
- ఫుల్ బాటిల్పై రూ.40 పెంపు
అయితే, బీర్లపై, చీఫ్ లిక్కర్, రెడీ టూ డ్రింక్ (RTD) పానీయాలపై ఈ స్పెషల్ ఎక్సైజ్ సెస్ (SES) వర్తించదని ఎక్సైజ్ శాఖ స్పష్టం చేసింది. వాటిపై ఇప్పటి వరకూ ఉన్న పాత పన్నులు యథాతథంగా కొనసాగుతాయని తెలిపింది.
మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో ఆదాయం లభిస్తోంది. నూతన విధానం ద్వారా రాష్ట్ర ఖజానాకు అదనపు ఆదాయం సమకూరేలా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Post a Comment