-->

ఘోర రోడ్డు ప్రమాదం: లారీని కారు డీ ముగ్గురు యువకుల దుర్మరణం

ఘోర రోడ్డు ప్రమాదం: లారీని కారు డీ ముగ్గురు యువకుల దుర్మరణం


హైదరాబాద్‌: నగర శివారులోని హయత్‌నగర్‌ మండలంలో శనివారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు యువకుల ప్రాణాలను బలితీసుకుంది. కుంట్లూర్‌ వద్ద ఓ కార్‌ డీసీఎం వాహనాన్ని ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. సీసీ కెమెరాల్లో ఈ దృశ్యం నమోదైంది.

పోలీసుల కథనం ప్రకారం, ముగ్గురు యువకులు చంద్రసేన రెడ్డి (24), త్రినాధ్ రెడ్డి (24), వర్షిత్ రెడ్డి (23) తమ స్నేహితులతో కలిసి కారులో ప్రయాణిస్తున్నారు. కారులోని డ్రైవర్ వేగంగా, నిర్లక్ష్యంగా వాహనం నడపడంతో కార్ నేరుగా డీసీఎంను వెనక నుంచి ఢీకొంది. ఢీకొట్టిన ధాటికి కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

పోలీసులు సమాచారం అందుకున్న వెంటనే ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను కారులో నుంచి బయటికి తీసారు. మృతులంతా ఒకే గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. బాధితుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ప్రస్తుతం ఈ ఘటనతో సంబంధించి సీసీ ఫుటేజ్‌ ఆధారంగా ప్రమాదం జరిగిన కారణాలు వివరంగా పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ సంఘటన స్థానికంగా విషాదాన్ని కలిగించింది. గ్రామంలో శోకచాయలు అలుముకున్నాయి.

Blogger ఆధారితం.