కుమారుడితో బిల్డింగ్ పై నుండి దూకిన తల్లి – తల్లి మృతి, బాబు సురక్షితం
బంగారం చోరీ బాధతో మనస్తాపానికి గురై తన కుమారుడితో బిల్డింగ్ పై నుండి దూకిన తల్లి – తల్లి మృతి, బాబు సురక్షితంగా బయటపడ్డ ఘటన
హైదరాబాద్: నగరంలోని చింతల్‌కుంట ప్రాంతంలో విషాదం చోటుచేసుకుంది. ఈ నెల 16న జరిగిన ఓ శుభకార్యానికి హాజరైన సమయంలో సుధేష్ణ (28) అనే మహిళకు చెందిన ఏడు తులాల బంగారు ఆభరణాలు అజ్ఞాత వ్యక్తులు అపహరించారు. ఈ సంఘటన ఆమెకు తీవ్ర మనస్తాపాన్ని కలిగించింది.
బంగారం దొరకకపోవడం వల్ల తీవ్ర ఆందోళనకు లోనైన సుధేష్ణ, తన రెండున్నరేళ్ల కుమారుడు ఆరుష్ కుమార్‌ను తీసుకొని నివాసముండే భవనం మూడో అంతస్తు పై నుంచి కిందకు దూకింది. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. అయితే ఆమె కుమారుడు ఆరుష్‌కు మాత్రం స్వల్ప గాయాలు మాత్రమే వచ్చాయని, ప్రస్తుతం అతడు ప్రమాదం నుండి బయటపడినట్లు వైద్యులు తెలిపారు.
ఈ విషాద సంఘటన పట్ల స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బంగారం చోరీ జరిగిన నేపథ్యంలో ఆ దిశగా విచారణ ముమ్మరం చేశారు.
Post a Comment