-->

జొన్నల కొనుగోలు కేంద్రం వెంటనే ఏర్పాటు చేయాలి

 

జొన్నల కొనుగోలు కేంద్రం వెంటనే ఏర్పాటు చేయాలి

 GMR ఫౌండేషన్ చైర్మన్ గుఱ్ఱపు మచ్చేందర్ డిమాండ్

నారాయణఖేడ్ నియోజకవర్గంలో జొన్న రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై GMR ఫౌండేషన్ చైర్మన్ గుఱ్ఱపు మచ్చేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా మచ్చేందర్ మాట్లాడుతూ, "రైతులు తమ పండించిన జొన్నలను సరైన ధరలకు అమ్మలేక తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో, మార్కెట్‌లో ధరలు పడిపోతుండటంతో, రైతులు కనీస మద్దతు ధర కంటే తక్కువ ధరలకే అమ్మే పరిస్థితి ఏర్పడుతోంది," అని పేర్కొన్నారు.

రైతుల హక్కులను పరిరక్షించేందుకు ప్రభుత్వం వెంటనే స్పందించాలని, కనీస మద్దతు ధరకు పంట కొనుగోలు జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Blogger ఆధారితం.