లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ మండల సర్వేయర్
తహసీల్దార్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మండల సర్వేయర్
నిర్మల్ జిల్లా కడెం మండల తహసీల్దారు కార్యాలయంలో పనిచేస్తున్న మండల సర్వేయర్ పవార్ ఉమాజీ, ఫిర్యాదుదారుని కుటుంబ సభ్యులకు చెందిన భూమికి సంబంధించి హక్కుదారుల ధ్రువీకరణ పత్రం జారీ చేయడం మరియు సంబంధిత భూ స్థల చిత్రపటాన్ని తహసీల్దారుకు పంపించేందుకు, ఫిర్యాదుదారుని నుండి లంచం రూపంలో రూ.7,000/- తీసుకుంటూ తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ అధికారులకు అడ్డంగా పట్టుబడ్డాడు.
అయితే, మొదటగా ఆయన మొత్తం రూ.25,000/- లంచం డిమాండ్ చేయగా, ఫిర్యాదుదారుడి వినతిని పరిగణనలోకి తీసుకొని, దానిని రూ.20,000/-కి తగ్గించాడు. ఈలోగా, తేది 20.05.2025 నాటికి మొదటి విడతగా రూ.12,000/- లంచం తీసుకున్నాడు.
ఈ నేపథ్యంలో, ఆయన పై అవినీతి నిరోధక శాఖ క్రిమినల్ కేసు నమోదు చేసి, తదుపరి చట్ట ప్రక్రియలు ప్రారంభించబడినవి.
ప్రజలకు విజ్ఞప్తి: ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా లంచం కోరిన పక్షంలో, దయచేసి వెంటనే తెలంగాణ అవినీతి నిరోధక శాఖను సంప్రదించండి. క్రింద ఇచ్చిన మార్గాల్లో సమాచారం ఇవ్వవచ్చును:
- టోల్ ఫ్రీ నంబర్: 1064
- వాట్సాప్: 9440446106
- ఫేస్‌బుక్: [Telangana ACB]
- ఎక్స్ (Twitter): [@TelanganaACB]
- వెబ్‌సైట్: acb.telangana.gov.in
ఫిర్యాదుదారుల / బాధితుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయి.
Post a Comment