-->

భారత సైన్యానికి కృతజ్ఞతలు తెలియజేసిన కాపు సీతాలక్ష్మి, కాపు కృష్ణ

భారత సైన్యానికి కృతజ్ఞతలు తెలియజేసిన కాపు సీతాలక్ష్మి, కాపు కృష్ణ

 ఆపరేషన్ సిందూర్‌పై స్పందన

భద్రాద్రి కొత్తగూడెం, మే 7: పాకిస్తాన్, పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం "ఆపరేషన్ సిందూర్" పేరిట మెరుపుదాడులు జరపడం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా ఈ సర్జికల్ స్ట్రైక్స్‌ నిర్వహించినట్లు రక్షణ శాఖ ప్రకటించింది.

ఈ నేపథ్యంలో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన బీఆర్‌ఎస్ నాయకురాలు మరియు మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ కాపు సీతాలక్ష్మి, టిబిజికెఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ భారత సైన్యకు అభినందనలు తెలిపారు. “పహల్గాం దాడికి ఇదే సరైన ప్రతికారం. మన సైన్యం ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడం గర్వకారణం. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పాకిస్తాన్‌లోని ఉగ్ర శిబిరాలు, మౌలిక సదుపాయాలను పూర్తిగా తొలగించాలి” అని వారు పేర్కొన్నారు.

తమ అభిప్రాయాన్ని “జై హింద్!” అంటూ ముగించిన ఈ నేతలు, దేశ భద్రత కోసం ప్రాణాలను సైతం త్యాగం చేస్తున్న సైనికుల పట్ల కృతజ్ఞత వ్యక్తం చేశారు.

Blogger ఆధారితం.