ప్రముఖ సింగర్ పవన్ దీప్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురి
తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇండియన్ ఐడల్ విజేత
ఇండియన్ ఐడల్ సీజన్ 12 విజేత మరియు ప్రజాదరణ పొందిన గాయకుడు పవన్ దీప్ రాజన్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తెల్లవారు జామున 3 గంటల సమయంలో ఉత్తరాఖండ్ ప్రాంతంలో నేషనల్ హైవే-9పై ప్రయాణిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
పవన్ దీప్ ప్రయాణిస్తున్న కారు అతని ముందు వెళ్తున్న ట్రక్కును ఢీకొట్టడంతో వాహనం పూర్తిగా నుజ్జునుజ్జు అయిపోయింది. ఈ ప్రమాదంలో పవన్ దీప్‌కు తీవ్రమైన గాయాలయ్యాయి. ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో స్థానికులు వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
గాయాలు తీవ్రంగా ఉండటంతో, పవన్ దీప్‌ను అత్యవసరంగా నోయిడాలోని ఫోర్టిస్ హాస్పిటల్‌కు తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. డాక్టర్ల ప్రకారం, ఆయన శరీరంలో అనేక భాగాల్లో ఫ్రాక్చర్లు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆయన స్థితి ఆందోళనకరంగానే ఉన్నట్లు సమాచారం.
ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కామెంట్లతో సోషల్ మీడియాను ముంచెత్తుతున్నారు.
Post a Comment