-->

అభివృద్ధిలో దగాపడ్డ దళితులను ప్రభుత్వం ఆదుకోవాలి

అభివృద్ధిలో దగాపడ్డ దళితులను ప్రభుత్వం ఆదుకోవాలి

లక్ష్మీదేవిపల్లిలో ఎస్సీ హక్కుల కోసం ధర్నా – తాహసిల్దార్‌కు వినతిపత్రం

షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి లక్ష్మీదేవిపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో శనివారం స్థానిక తాహసిల్దార్ కార్యాలయం ఎదుట ఎస్సీలు భారీగా నిరసన తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాల్లో దళితులు నిర్లక్షించబడుతున్నారని మండిపడ్డ వారు, ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా తాహసిల్దార్ కె.ఆర్.కె.వి ప్రసాద్‌కు తమ డిమాండ్లను విన్నవిస్తూ వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బొమ్మెర శ్రీనివాస్ మాట్లాడుతూ, ‘‘ఏజెన్సీ ప్రాంతం పేరుతో అభివృద్ధిలో దళితులను పక్కనబెట్టే ధోరణి ఆపాలి. ఎస్టీలతోపాటు ఎస్సీలకు కూడా సమాన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉంది’’ అని స్పష్టంచేశారు.

ఇంతకుముందు అమలులో ఉన్న స్థానిక ఎస్సీ రిజర్వేషన్‌ను తిరిగి అమలు చేయాలని, 2025లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 2014 గణాంకాలను ఆధారంగా తీసుకొని ఎస్సీ కులాలకు జడ్పిటిసి, ఎంపీటిసి స్థాయిలో రిజర్వేషన్లు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

అలాగే, తరం తరాలుగా సాగు చేస్తున్న ఎస్సీ రైతుల భూములకు, పొడు భూములకు భూ భారతి చట్టం ద్వారా హక్కుపత్రాలు ఇవ్వాలని, ఉద్యోగ నియామకాలలో అటెండర్, ఆంగన్‌వాడీ టీచర్, ఆయా, సూపర్ వంటివి స్థానిక ఎస్సీ రిజర్వేషన్ ప్రకారం భర్తీ చేయాలని వినతి చేశారు.

ఈ ధర్నాలో జేఏసీ రాష్ట్ర కో కన్వీనర్ కాకెల్లి సైమన్, మాజీ ఎంపీటీసీ దారా శ్రీనివాసరావు, చదలవాడ సూరి, కండే రాములు, నరాల రాజేష్, కాకాటి బాబు, ఎనగంటి శ్రీను, గుంటమల్ల వీరస్వామి, శివ, కండే వెంకటేశ్వర్లు, బొమ్మెర కళ్యాణ్, నైనారపు సాగర్ తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.