-->

ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ.. ఓటమి పాలైన వెంకటేశ్వర్లు

ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ.. ఓటమి పాలైన వెంకటేశ్వర్లు


సూర్యాపేట జిల్లా, కోదాడ మండలం గుడిబండ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేసిన వెంకటేశ్వర్లు ఓటమిని ఎదుర్కొన్నారు. ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన నిర్ణయం ఇప్పుడు స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది.

వెంకటేశ్వర్లు సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తూ, ఇంకా ఐదు నెలల సేవా కాలం మిగిలి ఉండగానే వీఆర్‌ఎస్‌ తీసుకుని పంచాయతీ ఎన్నికల్లో బరిలోకి దిగారు. తన పుట్టిన గ్రామానికి సేవ చేయాలన్న లక్ష్యంతో ఎన్నికల్లో పోటీ చేశానని ఆయన తెలిపారు. నల్గొండకు చెందిన ఉత్తమ్ కుమార్‌రెడ్డి, పద్మావతి మద్దతు కూడా లభించినప్పటికీ, ఎన్నికల ఫలితాల్లో విజయం దక్కలేదు.

ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ ఓటమి ఎదురుకావడంతో వెంకటేశ్వర్లకు నిరాశే మిగిలిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనతో “ఉద్యోగం–రాజకీయాలు” అంశంపై చర్చలు మళ్లీ మొదలయ్యాయి.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793