శేషగిరినగర్ గ్రామపంచాయతీ ఎన్నికల్లో బాణోత్ శాంతి దూసుకుపోతున్న ప్రచారం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శేషగిరి నగర్ గ్రామపంచాయతీ ఎన్నికలు రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో సిపిఐ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా బాణోత్ శాంతి బరిలోకి దిగారు. గ్రామ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఆమె ప్రచారం గ్రామవ్యాప్తంగా మంచి స్పందన పొందుతోంది. సీపీఐ పార్టీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కబట్టి గ్రామం అభివృద్ధి చేయుటకు పూర్తి సహకారం ఉంటుందని ఓటర్లకు తెలిజేస్తూ ప్రచారం చేస్తున్నారు.
సర్పంచ్ అభ్యర్థి బాణోత్ శాంతి గడప గడపకు వెళ్లి ప్రజలను కలుస్తూ, తన అభివృద్ధి ప్రణాళికలను వివరిస్తున్నారు. గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధి, తాగునీటి సమస్య పరిష్కారం, పారిశుధ్యం, రోడ్ల విస్తరణ, పేదల సంక్షేమం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని ఆమె హామీ ఇస్తున్నారు. ప్రజలతో నేరుగా మమేకమై, వారి సమస్యలను శ్రద్ధగా వింటూ పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇస్తున్నారు.
ఈ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్‌పై సీరియల్ నెంబర్ 3 – బ్యాట్ గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని బాణోత్ శాంతి ఓటర్లను కోరుతున్నారు. కాంగ్రెస్ పార్టీతో పాటు సిపిఐ శ్రేణులు కూడా ఆమెకు సంపూర్ణ మద్దతు తెలుపుతూ ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు.
గ్రామంలో పారదర్శక పాలన, ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి సాధ్యమని చెబుతున్న బాణోత్ శాంతి ప్రచారం రోజురోజుకీ వేగం పెంచుతోంది. శేషగిరి నగర్ గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఆమె విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని ఆమె అనుచరులు, పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.

Post a Comment