-->

సంక్రాంతికి అదనంగా 41 ప్రత్యేక రైళ్లు నేటి ఉదయం 8 గంటల నుంచే ముందస్తు రిజర్వేషన్లు ప్రారంభం

సంక్రాంతికి అదనంగా 41 ప్రత్యేక రైళ్లు నేటి ఉదయం 8 గంటల నుంచే ముందస్తు రిజర్వేషన్లు ప్రారంభం


హైదరాబాద్: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. అదనంగా 41 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు శనివారం అధికారికంగా ప్రకటించింది.

ఈ ప్రత్యేక రైళ్లకు సంబంధించిన ముందస్తు బుకింగులు నేటి (ఆదివారం) ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమవుతాయని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఏ. శ్రీధర్ వెల్లడించారు.

పండుగ సమయంలో స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య భారీగా పెరగనున్న నేపథ్యంలో ఈ ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. ముఖ్యంగా సికింద్రాబాద్, వికారాబాద్, లింగంపల్లి రైల్వే స్టేషన్ల నుంచి కాకినాడ, నర్సాపూర్, తిరుపతి వంటి ప్రధాన గమ్యస్థానాలకు ఎక్కువ ప్రత్యేక రైళ్లు నడపనున్నారు.

ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు. ప్రత్యేక రైళ్ల పూర్తి వివరాలు, టైమింగ్స్‌ను రైల్వే అధికారిక వెబ్‌సైట్‌లో లేదా రిజర్వేషన్ కౌంటర్లలో తెలుసుకోవచ్చని తెలిపారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793