మహబూబాబాద్ జిల్లాలో దారుణ హత్య కోడలిని గొంతు పిసికి చంపిన అత్తమామలు, భర్త, మరిది
కొమ్ముగూడెం గ్రామంలో కోడలిని గొంతు పిసికి చంపిన అత్తమామలు, భర్త, మరిది
మహబూబాబాద్ డిసెంబర్ 14: మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ మండలం కొమ్ముగూడెం గ్రామంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో అత్త, మామ, భర్త, మరిది కలిసి కోడలిని గొంతు పిసికి హత్య చేసినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది.
మృతురాలికి ఇద్దరు చిన్నపిల్లలు ఉండటంతో ఈ ఘటన మరింత విషాదంగా మారింది. హత్య అనంతరం నిందితులైన నలుగురు ఇంటి నుంచి పరారైనట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు. మృతురాలి తల్లిదండ్రులు ఘటన స్థలానికి చేరుకుని శోకసంద్రంలో మునిగిపోయారు.
ఘటనకు గల కారణాలపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.
గమనిక: అధికారిక ధృవీకరణతో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంద

Post a Comment