ఓటు వేయడానికి వెళ్తూ విషాదం… రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి
హన్మకొండ జిల్లా: హైదరాబాద్‌లో నివసిస్తూ రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు స్వగ్రామానికి బయలుదేరిన ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు.
హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం నందనం గ్రామానికి చెందిన బుర్ర కళ్యాణ్ (27), నవీన్ (27) అనే స్నేహితులు బైక్‌పై స్వగ్రామానికి వెళ్తుండగా, స్టేషన్ ఘనపూర్ సమీపంలోని రాఘవపూర్ వద్ద జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం వీరి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన వాహనం కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ విషాద ఘటనతో నందనం గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

Post a Comment