ఈ నెల 20న కొత్త సర్పంచుల ప్రమాణ స్వీకారం
హైదరాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన సర్పంచులు, వార్డు సభ్యులు ఈ నెల 20వ తేదీన అధికారికంగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామ పంచాయతీల్లో అదే రోజు ప్రమాణ స్వీకార కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొంది. మూడు విడతలుగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఒకేసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
దీంతో రాష్ట్రంలోని మొత్తం 12,700 గ్రామ పంచాయతీల్లో కొత్త పాలకవర్గాలు అధికారికంగా కొలువుదీరనున్నాయి. గ్రామ పాలనలో కొత్త అధ్యాయానికి ఇది ఆరంభంగా నిలవనుంది.

Post a Comment