ఆభరణాలు లాక్కొని కన్న తల్లిని అడవిలో వదిలేసిన కూతురు!
జగిత్యాల జిల్లాలో మానవతా విలువలు మరిచిపోయిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. కన్న తల్లినే ఆభరణాల కోసం అడవిలో వదిలేసిన కూతురు ప్రవర్తన పట్ల ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇస్లాంపుర వీధిలో నివసిస్తున్న బుధవ్వ అనే వృద్ధురాలికి ఈశ్వరీ అనే కుమార్తె ఉంది. ఇటీవల ఆమె తల్లిని స్థానిక అడవిలోకి తీసుకెళ్లింది. అక్కడ ఆమె మెడలో ఉన్న బంగారు ఆభరణాలు తీసుకొని పరారైంది. వృద్ధురాలిని అక్కడే ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయింది.
ఆమెకు తిండి దొరకక రెండు రోజులపాటు అడవిలోనే తిరుగుతూ బాధలు అనుభవించింది. కాస్తశేపటికి అక్కడికి వచ్చిన యువకులు బుధవ్వను చూసి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన పోలీసులు ఆమెను బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతానికి ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.
ఇంతటి ఘోరమైన ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఈశ్వరీపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం పోలీసులు ఆమె ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఇది కేవలం ఒక కుటుంబం కాదు — సమాజంలోని మానవీయత ఎంత దుర్బలమైందో చూపించే ఉదాహరణగా మారింది.
Post a Comment