6 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ చిక్కిన ఉస్మానియా యూనివర్సిటీలో ఏఈఈ
హైదరాబాద్, తార్నాక: ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో చేపట్టిన పునరుద్ధరణ పనులకు సంబంధించిన బిల్లుల విడుదల విషయంలో లంచం డిమాండ్ చేసిన అధికారిని తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఈ క్రమంలో ఇప్పటికే రూ.5,000 లంచంగా తీసుకున్న ఆయన, మిగిలిన రూ.6,000 తీసుకుంటున్న సమయంలో తెలంగాణ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఈ ఘటన హైదరాబాద్ తార్నాకలోని ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో చోటుచేసుకుంది. ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
లంచం అడిగితే ఇలా ఫిర్యాదు చేయండి
ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం డిమాండ్ చేస్తే ప్రజలు వెంటనే తెలంగాణ అవినీతి నిరోధక శాఖను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు.
- టోల్ ఫ్రీ నెంబర్: 1064
- వాట్సాప్: 9440446106
- ఫేస్‌బుక్: Telangana ACB
- ఎక్స్ (ట్విట్టర్): @TelanganaACB
- వెబ్‌సైట్: acb.telangana.gov.in
👉 ఫిర్యాదుదారుల / బాధితుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయి.

Post a Comment