-->

నేడు తెలంగాణలో ఈదురుగాలులతో వర్షాలు..!!

నేడు తెలంగాణలో ఈదురుగాలులతో వర్షాలు..!!


హైదరాబాద్: రాష్ట్రంలో వాతావరణం మళ్లీ మారే సూచనలున్నాయి. తెలంగాణలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వచ్చే మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.

ఈ రోజు (సోమవారం) నాటికి నిజామాబాద్, పెద్దపల్లి, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశముంది.

ఈ నేపథ్యంలో వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మెరుపులు, గాలివానలతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

చిన్న వానలు, ఈదురుగాలులు రైతులకు మేలే అయినా... భారీ గాలులతో జాగ్రత్త అవసరం. పంటలను, ఎరువులు, విత్తనాలను సురక్షితంగా ఉంచాలని వ్యవసాయ శాఖ సూచిస్తోంది.

Blogger ఆధారితం.