ఘోర రోడ్ ప్రమాదం... ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి
ఘోర రోడ్ ప్రమాదం... ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల మండలం చింతకుంట రామయ్యపల్లె గ్రామ శివారులో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన డీసీఎం వ్యాన్ ఎదురుగా వస్తున్న బైకును ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు.
మృతులు చింతకుంట రామయ్యపల్లెకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. వీరి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
వాహనం వేగంగా ప్రయాణించటం, డ్రైవర్ అజాగ్రత్త కారణంగా ఈ ప్రమాదం చోటుచేసిందని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. డ్రైవర్ పరారీలో ఉన్నట్టు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఒకే ఊరి ఇద్దరు యువకుల మృతి పట్ల గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు..
Post a Comment