తెలంగాణలో 13 రాజకీయ పార్టీలకు ఈసీ షాక్..!!
📍 హైదరాబాద్: రాష్ట్ర ఎన్నికల సంఘం (ఈసీ) కీలకంగా స్పందించింది. గత ఆరు సంవత్సరాలుగా ఏ ఎన్నికల్లోనూ పాల్గొనని 13 రాజకీయ పార్టీలను అధికారికంగా తొలగించేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ క్రమంలో “ఎందుకు మీ పార్టీని రిజిస్టర్ చేసిన రాజకీయ పార్టీ జాబితా నుంచి తొలగించకూడదో” వివరంగా తెలియజేయాలని షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
ఈ నోటీసులను శుక్రవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. ఆయా జిల్లాల ఎన్నికల అధికారులు, జిల్లా కలెక్టర్లు ఈ అంశంలో చర్యలు తీసుకోవాలని, సంబంధిత పార్టీలు ఎంతకాలంగా ఎన్నికల్లో పోటీ చేయలేదో, ప్రజా కార్యకలాపాలేమైనా నిర్వహిస్తున్నాయా అనే వివరాలతో కూడిన నివేదికలు జూలై 10 లోపు సమర్పించాలని ఆదేశించారు. ఈ నివేదికలను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపనున్నట్లు పేర్కొన్నారు.
ఈ పార్టీలపై ఆరోపణలు ఇలా ఉన్నాయి:
- ప్రజల్లో దృష్టి ఆకర్షించేందుకు పార్టీ పేరును ఉపయోగిస్తూ పత్రికల్లో ప్రకటనలు
- సోషల్ మీడియాలో రాజకీయ ప్రచారం
- కానీ, ఎన్నికల పోటీ లేకపోవడం
❗నోటీసులు అందుకున్న 13 రాజకీయ పార్టీలు:
- నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ – హైదరాబాద్
- తెలంగాణ లోక్ సత్తా పార్టీ – హైదరాబాద్
- తెలంగాణ మైనారిటీస్ ఓబీసీ రాజ్యం – హైదరాబాద్
- యువ పార్టీ – హైదరాబాద్
- బహుజన్ సమాజ్ పార్టీ (అంబేద్కర్-ఫూలే) – మేడ్చల్ మల్కాజిగిరి
- తెలంగాణ స్టూడెంట్స్ యునైటెడ్ ఫర్ నేషన్ పార్టీ – మేడ్చల్ మల్కాజిగిరి
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమైక్య సమితి పార్టీ – రంగారెడ్డి
- జాతీయ మహిళా పార్టీ – రంగారెడ్డి
- యువ తెలంగాణ పార్టీ – రంగారెడ్డి
- తెలంగాణ ప్రజా సమితి (కిషోర్, రావు, కిషన్) – వరంగల్
- తెలంగాణ కార్మిక రైతు రాజ్యం పార్టీ – హన్మకొండ
- ఇండియన్ మైనారిటీస్ పొలిటికల్ పార్టీ – హైదరాబాద్
- జాగో పార్టీ – హైదరాబాద్
📌ఈ చర్యలతో రాష్ట్రంలోని రాజకీయ వాతావరణంపై మరింత స్పష్టత రావొచ్చని భావిస్తున్నారు. పార్టీగా గుర్తింపు ఉండాలంటే క్రమం తప్పకుండా ఎన్నికల్లో పాల్గొనాల్సిన అవసరం ఉందని ఈసీ స్పష్టం చేస్తోంది..
Post a Comment