-->

మోహర్రం కర్బలా కథ: ధర్మం కోసం అసాధారణ త్యాగం

మోహర్రం కర్బలా కథ: ధర్మం కోసం అసాధారణ త్యాగం

ఖాజీ మహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ,
వైస్ ప్రెసిడెంట్, జమాత్ ఎ ఇస్లామీ – టెమ్రీస్ కౌన్సిలర్
📞 99494 76824

ముహర్రం అనే మాట వినగానే మనసుకు హత్తుకునే చారిత్రక సంఘటన – కర్బలా సంగ్రామం గుర్తొస్తుంది. అది ఒక యుద్ధ క్షేత్రం మాత్రమే కాదు... ఒక నిస్వార్థ త్యాగానికి, ధర్మాన్ని నిలుపుకునే నిబద్ధతకు శాశ్వత చిహ్నం. ఇస్లాం ఖిలాఫత్ వ్యవస్థను నిలబెట్టేందుకు ప్రవక్త మహమ్మద్ (స.అ) మనుమడు ఇమామ్ హుసేన్ (ర.అ) చేసిన త్యాగం ప్రపంచ చరిత్రలో అపూర్వమైనది.

ఇస్లాములో రాజ్యాధికారపు ధార్మిక పాలనా వ్యవస్థగా ఖలీఫా వ్యవస్థ ఉండేది. కానీ హజ్రత్ మావియా, తన కుమారుడు యజీద్కు రాజ్యాన్ని అప్పగించడంతో, ఇస్లాములో రాచరిక వ్యవస్థ ప్రారంభమైంది. ఇది ధర్మబద్ధతకు విరుద్ధమని భావించిన ఇమామ్ హుసేన్, తన కుటుంబంతో పాటు యజీద్‌ను ఖలీఫాగా ఒప్పుకోకుండా తిరుగుబాటు చేశారు.

కూఫా నగర ప్రజల ఆహ్వానంతో హుసేన్ తమ 72 మంది కుటుంబ సభ్యులు, అనుచరులతో మక్కా నుంచి కూఫా వైపు బయలుదేరారు. కానీ కర్బలాలో యజీద్ సైన్యం వారిని అడ్డగించింది. అనేక రోజుల పాటు నీరు లేక, ఆకలితో బాధపడుతున్న వారి మీద దాడి జరిగింది.

పసిపిల్ల అయిన అలీ అస్గర్ నీళ్ల కోసం విలపించిన సమయంలో కూడా శత్రు సైన్యం మానవత్వం కోల్పోయింది. ఒక్క తండ్రి ప్రాణం మీద కాదు... తన కుమారుడి మీద కూడ తుపాకులా బాణాలు కురిపించింది. ఆ దుఃఖద క్షణాల్లో కూడా ఇమామ్ హుసేన్ ధర్మాన్ని వీడలేదు.

వేధింపులు, ఆకలి, దాహంతో కూడా భయపడకుండా, సజ్జద్ చేయడానికి చివరి క్షణం వరకు ప్రయత్నించి, చివరకు యజీద్ సైన్యం చేతిలో హత్యకు గురయ్యారు. ఆయన తల, చేతులు ఖండించబడ్డాయి. ఇలా ఒక గొప్ప ధర్మయోధుడు ప్రాణత్యాగం చేశారు.

ఈ సంఘటన ముహర్రం పదవ రోజు జరిగినదే కావడం వల్ల, ఆశూరాగా ముస్లింలు దానిని తలచుకుంటారు. ఇది విడుదల కన్నా ఎక్కువగా వ్యథను, బలిదానాన్ని గుర్తుచేసే రోజు.

కర్బలా కథ మనకు ధర్మాన్ని రక్షించడంలో ఎంతటి త్యాగం అవసరమో నేర్పుతుంది. హుసేన్ త్యాగం నేటికీ అక్షరాలా జీవిస్తూ, ప్రతి ముస్లింల మనసులో తళుకులెత్తుతోంది.


Blogger ఆధారితం.