💔ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ గర్ల్‌తో ప్రేమ వ్యవహారం.. యువ డాక్టర్ భార్య ఆత్మహత్య
హన్మకొండ, సోషల్ మీడియా కారణంగా ఓ కుటుంబంలో కలకలం రేగింది. ప్రేమ వ్యవహారాల నేపథ్యంలో ఓ యువ డాక్టర్ భార్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన హన్మకొండ జిల్లా హసన్పర్తిలో వెలుగులోకి వచ్చింది.
హసన్పర్తికి చెందిన డాక్టర్ సృజన్, డాక్టర్ ప్రత్యూషను 2017లో వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఇటీవల డాక్టర్ సృజన్, ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేసే యువతి శృతి అలియాస్ ‘బుట్ట బొమ్మ’తో సన్నిహితంగా మెలిగుతున్నట్లు తెలుస్తోంది. వీరి మధ్య ప్రేమ సంబంధం ఏర్పడిందని ప్రత్యూష అనుమానించి మనస్తాపానికి లోనయ్యిందని కుటుంబసభ్యులు చెబుతున్నారు.
ఈ విషయంలో భర్త సృజన్ తనను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాడని, తాను ఒంటరిగా మానసిక వేదనకు గురవుతున్నానని ప్రతిదినం వ్యక్తం చేస్తూ వచ్చిన ప్రత్యూష.. చివరికి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
ఇక మరోవైపు, తన కుమార్తెను చంపేంత వరకూ మానసికంగా వేధించిన వ్యక్తిగా సృజన్‌పై ఘాటుగా స్పందించిన ప్రత్యూష తండ్రి.. మనవురాలిని కూడా అతను హింసించాడని ఆరోపిస్తూ హసన్పర్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు డాక్టర్ సృజన్‌ను అదుపులోకి తీసుకున్నారు. పూర్తి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
Post a Comment