-->

రూ.90,000/- లంచం తీసుకుంటూ ACBకు చిక్కిన ఉప కార్యనిర్వహణ ఇంజనీర్

రూ.90,000/- లంచం తీసుకుంటూ ACBకు చిక్కిన ఉప కార్యనిర్వహణ ఇంజనీర్


పెద్దపల్లి జిల్లా: సీసీ రోడ్డుపనులు పూర్తి చేసిన ఫిర్యాదుదారుడు, తాను చేసిన పనులను కొలతల పుస్తకంలో నమోదు చేయించి, ఆ నివేదికను పెద్దపల్లి సబ్ డివిజన్ ఉప కార్యనిర్వహణ ఇంజనీర్‌ కు పంపించేందుకు పెద్దపల్లి పంచాయతీ రాజ్ శాఖలో పనిచేస్తున్న ఎలిగేడు మండలానికి చెందిన సహాయక ఇంజనీర్ పి. జగదీష్ బాబు రూ.1,00,000/- లంచం డిమాండ్ చేశారు.

ఈ నేపథ్యంలో, రూ.90,000/- లంచం తీసుకుంటూ పి. జగదీష్ బాబు తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ప్రస్తుతం ఇతను కాల్వ శ్రీరాంపూర్ మరియు ఓదెల మండలాల ఇంచార్జిగా కూడా విధులు నిర్వహిస్తున్నాడు.

ఇలాంటి ఘటనలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా లంచం అడిగినప్పుడు లేదా అవినీతి చర్యలకు పాల్పడినప్పుడు వెంటనే తెలంగాణ అవినీతి నిరోధక శాఖ ను సంప్రదించవచ్చు.

👇 అవినీతి నివేదిక ఇవ్వడానికి వివరాలు:
📞 టోల్ ఫ్రీ నంబర్: 1064
📱 వాట్సాప్: 9440446106
📘 ఫేస్‌బుక్: [Telangana ACB]
🐦 X (Twitter): @TelanganaACB
🌐 వెబ్‌సైట్: acb.telangana.gov.in

గమనిక: ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
ఒక మెరుగైన సమాజం కోసం... అవినీతిని ఎదిరించండి!


Blogger ఆధారితం.