-->

బీసీలకు 42% రిజర్వేషన్ల ఆర్డినెన్స్‌కు కృతజ్ఞతలు తెలిపిన బీసీ సంక్షేమ సంఘం

బీసీలకు 42% రిజర్వేషన్ల ఆర్డినెన్స్‌కు కృతజ్ఞతలు తెలిపిన బీసీ సంక్షేమ సంఘం


తెలంగాణలో స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన చారిత్రక ఆర్డినెన్స్‌పై రాష్ట్ర వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ భేటీలో మంత్రి కొండా సురేఖ, సీఎం సలహాదారు వేం. నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడుతూ:

"ఇది కేవలం ఓ ఆర్డినెన్స్ కాదు – ఇది బీసీ వర్గాల ఆకాంక్షలకు న్యాయం. ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్రలో మరో చిరస్మరణీయ ఘట్టంగా నిలిచే నిర్ణయం.
రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో కాంగ్రెస్ తీసుకుంటున్న నిర్ణయాలను దేశం అభినందిస్తోంది.
బీజేపీకి రిజర్వేషన్ల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. వారి పాలనలో చిత్తశుద్ధి లేదని ఇది రుజువు చేస్తోంది.

📌 రానున్న 2029 ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ప్రధాన జెండాగా మారాలి. కేవలం తెలంగాణలో కాదు, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో రిజర్వేషన్ల అమలే లక్ష్యంగా ముందుకు సాగుదాం.
✊ ఇది బీసీ హక్కుల పోరాటంలో ఒక చారిత్రక మలుపు!"

జాజుల శ్రీనివాస్ గౌడ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, "బీసీల ఆకాంక్షలకు న్యాయం జరిగే దిశగా ఈ నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుంది. సీఎం గారికి, టీపీసీసీ అధ్యక్షుడికి మా సంఘం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు" అని తెలిపారు.


Blogger ఆధారితం.