లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో మహిళా పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ
💥 ₹15,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ అధికారులు 💥
సైబరాబాద్, గచ్చిబౌలిలోని మహిళా పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న సబ్ ఇన్‌స్పెక్టర్ కె.వై. వేణు గోపాల్ లంచం తీసుకుంటూ తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు పట్టుబడ్డారు. ఫిర్యాదుదారుని తల్లి పేరును ఒక కేసులో తొలగించేందుకు రూ.25,000 లంచాన్ని ఆయన డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది.
ఈ సమాచారంపై స్పందించిన ACB అధికారులు సన్నద్ధంగా చేసి, ప్రత్యక్షంగా లంచం తీసుకుంటున్న వేణు గోపాల్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ప్రస్తుతం ఆయనపై కేసు నమోదు చేసి విచారణ కొనసాగుతోంది.
ప్రజలకు సూచన: ఏదైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం కోరినచో, వెంటనే తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) ను సంప్రదించవచ్చు. టోల్‌ఫ్రీ నంబర్ 1064 ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. అదేవిధంగా వాట్సాప్ (9440446106), ఫేస్‌బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB), లేదా వెబ్‌సైట్ (acb.telangana.gov.in) ద్వారా కూడా సంప్రదించవచ్చు.
ఫిర్యాదుదారుల వివరాలను ACB గోప్యంగా ఉంచుతుంది.
Post a Comment