అరుణాచలంలో మోత్కూరు యువకుడి హత్య
మోత్కూరు, యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు పట్టణానికి చెందిన యువకుడు అరుణాచలంలో దైవ దర్శనానికి వెళ్లి దొంగల దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుడు ఇందిరానగర్‌కు చెందిన చిప్పలపల్లి విద్యాసాగర్ (28)గా గుర్తించారు.
విద్యాసాగర్ మెడికల్ రిప్రజెంటేటివ్‌గా హైదరాబాద్‌లోని కంపెనీ క్వార్టర్స్‌లో నివాసముంటూ పని చేస్తున్నాడు. అతని తండ్రి చిప్పలపల్లి రవీందర్ తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో ఎస్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
విద్యాసాగర్ గతంలో రెండు సార్లు స్నేహితులతో కలిసి అరుణాచల దర్శనానికి వెళ్లగా, ఈ సారి వాళ్లు రావలేమని చెప్పడంతో ఒక్కడే వెళ్లాలని నిర్ణయించాడు. ఈ నెల 4న స్వగ్రామం వచ్చి తాతను చూసి, 6న తిరిగి బయలుదేరాడు. 7న అరుణాచలం చేరుకున్న అతను, 8న రాత్రి గిరిప్రదక్షిణ చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు అతడిపై దాడికి పాల్పడి గొంతు కోసినట్లు సమాచారం. రాత్రంతా రోడ్డుపై కాసేపు హుషారుగా ఉండి తర్వాత అలసిపోవడంతో 9న ఉదయం పోలీసులు గుర్తించి ఆసుపత్రికి తరలించారు.
చికిత్స పొందుతూనే విద్యాసాగర్ ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు అరుణాచలానికి చేరుకున్నప్పటికే ఆయన మృతిచెందాడు. 10న పోస్టుమార్టం అనంతరం భౌతిక కాయాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు.
విద్యాసాగర్‌కు ఇద్దరు అక్కలు ఉన్నారు. తల్లిదండ్రులు త్వరలోనే కుమారుని వివాహం చేయాలని యోచిస్తున్న సమయంలో ఈ ఘటన జరగడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఇందిరానగర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.
Post a Comment