-->

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి.. పెళ్లైన రెండు నెలలకే విషాదం

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి.. పెళ్లైన రెండు నెలలకే విషాదం


వరంగల్ జిల్లా నెక్కొండకు చెందిన విష్ణువర్ధన్ (30) రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. మే 2న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందుకు చెందిన యువతితో విష్ణువర్ధన్ వివాహం జరిగింది. ఇటీవలే పెళ్లైన ఈ దంపతులు వారాంతపు సెలవు సందర్భంగా కలిసి ఉండేందుకు ఇల్లెందుకు చేరుకున్నారు.

ఈ క్రమంలో ఖమ్మం వెళ్లి షాపింగ్ చేయాలని భావించి బైక్‌పై బయలుదేరారు. అయితే మార్గమధ్యంలో అడ్డుగా వచ్చిన కుక్కను తప్పించబోయి బైక్ అదుపుతప్పి కిందపడింది. ఈ ప్రమాద సమయంలో వెనుక నుంచి వచ్చిన ట్రాక్టర్ బైక్‌పై పడింది. దీంతో తీవ్ర గాయాలైన దంపతులను వెంటనే ఆసుపత్రికి తరలించారు.

అయితే చికిత్సకు తీసుకెళ్తుండగానే విష్ణువర్ధన్ మృతి చెందాడు. భార్యకు కూడా గాయాలైనట్టు సమాచారం. వివాహం జరిగిన రెండు నెలలకే ఈ విషాదం చోటుచేసుకోవడంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదచాయలు అలుముకున్నాయి. స్థానికులు, స్నేహితులు ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Blogger ఆధారితం.