-->

మత్తులో బండి ఎక్కితే మృత్యువును ఆహ్వానించినట్లే..!

మత్తులో బండి ఎక్కితే మృత్యువును ఆహ్వానించినట్లే..!


ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో, వాటి వెనుక అసలు కారణాలపై పోలీస్ శాఖ అధ్యయనం చేస్తోంది. ఈ నేపథ్యంలో సుమారు 20 శాతం ప్రమాదాలు మద్యం లేదా గంజాయి మత్తులో వాహనాలు నడిపిన వారివల్లే జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

పలు ఘటనల్లో మత్తులో ఉన్న వ్యక్తులు ముందున్న వాహనాలను ఢీకొట్టడం, వేగాన్ని అదుపు చేయలేక డివైడర్లను తాకడం, చెట్లకు ఢీ కొట్టడం, డ్రైనేజీ కాలువల్లో పడిపోవడం వంటి ఘటనలు నమోదయ్యాయి. వీటిలో అనేక ఘటనలు ప్రాణాలు పోగొట్టుకునే స్థాయిలో దారుణంగా ఉంటున్నాయి.

ఇంకా ఎన్ని బలులు కావాలి?

నిత్యం కుటుంబాలు వీరి మూర్ఖత్వం వల్ల కన్నీటి పర్యంతం అవుతున్నాయి. ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలు ఆ బాధను జీవితాంతం మోస్తూ ఉండాల్సి వస్తోంది. మద్యం సేవించి బండి ఎక్కటం అంటే చేతులారా మరణానికి ఆహ్వానం పలికినట్లే.

పోలీసుల హెచ్చరిక

ఈ నేపథ్యంలో పోలీసులు కఠినంగా స్పందిస్తున్నారు. మత్తులో వాహనాలు నడిపినవారిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, లైసెన్స్ రద్దు, జైలు శిక్షలు, తదితర శిక్షలు విధిస్తున్నారు. ప్రజలను మేల్కొలిపేందుకు అవగాహన కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు.


జీవితం విలువైనది..! ఓ మద్యం తాగిన మూర్ఖపు నిర్ణయం జీవితాన్ని చీకటిలో ముంచొచ్చు. అందుకే – మత్తులో వాహనం నడపొద్దు..!


Blogger ఆధారితం.